జగన్ పొత్తు వద్దన్నారు: లక్ష్మారెడ్డి

YS Jagan
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ నేతృత్వంలోని ప్రజారాజ్యంతో పొత్తు వద్దని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అభిప్రాయపడ్డారని కాంగ్రెసు శాసనసభ్యుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి చెప్పారు. జగన్ తో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజారాజ్యంతో పొత్తు అవసరం లేదని గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శాసనసభ్యులు అభిప్రాయపడుతున్నారని, ఈ మేరకు తాము తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపుతామని ఆయన చెప్పారు. పొత్తును తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందిన నాయకులు కుట్ర చేసి ప్రజారాజ్యంతో పొత్తు సిద్ధపడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు ఒంటరిగా పోటీ చేయాలనేది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అభిమతమని, ఒంటరిగా పోటీ చేసి అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకుని కేంద్రంలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వైయస్ అనుకున్నారని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ఆశించారని, వైయస్ స్పూర్తిగా విరుద్ధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తుకు సిద్ధపడుతున్నారని ఆయన అన్నారు.

ప్రజారాజ్యం పార్టీతో పొత్తును హైదరాబాదులోని బంజారాహిల్స్ కాంగ్రెసు శాసనసభ్యుడు, దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా వ్యతిరేకించారు. పొత్తు వల్ల కోమాలో ఉన్న ప్రజారాజ్యం పార్టీకి ప్రాణం పోయడం అవుతుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాదులోని 24 శాసనసభా స్థానాల్లో కాంగ్రెసు 21 స్థానాలు గెలిచిందని, అందువల్ల ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెసు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుస్తుందని ఆయన అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజారాజ్యంతో పొత్తుపై కాంగ్రెసు శ్రేణుల అభిప్రాయం తెలుసుకోవాలని కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెసు విజయం సాధించిందని, ఈ స్తితిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అవసరం లేదని ఆయన కరీంనగర్ లో మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ డిమాండ్ ను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+