పిసిసి పదవిపై వైయస్ జగన్ కన్ను?

YS Jagan
హైదరాబాద్: తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్ష పదవిపై కన్నేసినట్లు కనిపిస్తోంది. ఈసారి ముఖ్యమంత్రి పదవిపై ఆశలు దాదాపుగా ఆయన వదులుకున్నట్లేనని భావిస్తున్నారు. పిసిసి అధ్యక్ష పదవిని దక్కించుకుని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు విజయం చేకూర్చి పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలనేది ఆయన ఎత్తుగడగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే జగన్ శిబిరం ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నట్లు భావిస్తున్నారు.

చాలా కాలం మౌనంగా ఉన్న మాజీ మంత్రి మారెప్ప డి.శ్రీనివాస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. శ్రీనివాస్ టికెట్లు అమ్ముకున్నారని, వేల కోట్ల రూపాయల సంపాదించారని ఆయన ఆరోపించారు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్ చేయడమే కాకుండా వైయస్ జగన్ ను పిసిసి అధ్యక్షుడిగా నియమించాలని ఆయన కోరుతున్నారు. ప్రజాదరణ గల నాయకుడిగా జగన్ ను చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలే జరుగుతున్నాయి.

కాంగ్రెసు పార్టీకి జగన్ తప్ప మరో దిక్కు లేదనిపించడానికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీతో పొత్తును వ్యతిరేకించి తమ సత్తా చాటామనే భావన కూడా జగన్ శిబిరంలో నెలకొని ఉంది. డి.శ్రీనివాస్ ను వ్యతిరేకిస్తూ అధిష్టానంపై ఒత్తిడి తేవడమే మార్గంగా నడుచుకుంటున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+