ఓబుళాపురంపై విచారణ: జగన్ కు ఉచ్చు

గాలి జనార్దన్ రెడ్డికి, జగన్ కు మధ్య వ్యాపార లావాదేవీలున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా ఓబుళాపురం గనుల తవ్వకాలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అయినా ఆయన గాలి జనార్దన్ రెడ్డికి బాసటగానే నిలిచారు. మైనింగ్ మాఫియా దేశానికి ప్రమాదకరంగా పరిణమించిందనే విమర్శలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. కర్నాటకలో యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని కూల్చడానికి గాలి జనార్దన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేజిక్కించుకోవడానికి జగన్ వర్గం ప్రయత్నాలు చేయడం, ఆయా పార్టీల కేంద్ర నాయకత్వాలకే సవాల్ విసిరిని వైనం తీవ్ర దుమారమే రేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓబుళాపురం గనుల తవ్వకాలపై వేటు వేస్తోంది. ఓబుళాపురం తవ్వకాలపై పది రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications