బిజెపి: అద్వానీ వర్సెస్ రాజ్ నాథ్

బిజెపిని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆర్ఎస్ఎస్ నియంత్రించడాన్ని రాజ్ నాథ్ వర్గం అంగీకరిస్తోంది. అయితే అద్వానీ వర్గం మాత్రం పార్టీ వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యాన్ని పూర్తి స్థాయిలో అంగీకరించడం లేదు. అయితే రాజ్ నాథ్ ఆర్ఎస్ఎస్ జోక్యాన్ని కోరినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్ తో పాటు బిజెపి ఖండిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ తమ సిద్ధాందానికి స్ఫూర్తి అని, అది బిజెపి పవర్ హౌస్ అని ప్రకాష్ జవేదకర్ అన్నారు. అవసరమైతే ఆర్ఎస్ఎస్ బిజెపికి సలహాలు మాత్రమే ఇస్తుందని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ అన్నారు.
లోకసభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బిజెపిలో విభేదాలు పెద్ద యెత్తున పొడసూపాయి. ప్రస్తుతం విభేదాలకు ఆర్ఎస్ఎస్ కారణంగా మారింది. తర్వాతి పార్టీ అధ్యక్ష పదవిలో సీనియర్ నాయకుడెవరూ ఉండకూడదని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. అయితే అద్వానీ వర్గం దాన్ని వ్యతిరేకిస్తోంది.












Click it and Unblock the Notifications