నాగ్ పై విమర్శలకు సిగ్గు లేదా: జెపి

Nagarjuna
హైదరాబాద్: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునపై విమర్శలు చేయడానికి తెలుగుదేశం పార్టీకి సిగ్గు లేదా అని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. నేర రాజకీయాలకు వ్యతిరేకంగా తాము నిర్మించిన యాడ్ లో నాగార్జున నటించారని, నేర రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తడం తప్పా అని ఆయన అన్నారు. అయినా తాము నాగార్జునతో నిర్మించిన యాడ్ 11 ఏళ్ల కిందటిదని చెబుతూ దాన్ని ఇప్పుడెందుకు తెలుగుదేశం లేవనెత్తుతోందని ఆయన ప్రశ్నించారు.

నేర రాజకీయాలకు కొమ్ము కాయకూడదని తాము గళమెత్తామని ఆయన చెప్పారు. రాజకీయాల్లో నేరస్థులను ప్రోత్సహించడమే తెలుగుదేశం లక్ష్యమా అని ఆయన అడిగారు. ఆరోపణలు మానకుంటే కోర్టులో దావా వేస్తానని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను హెచ్చరించారు. నేటి తెలుగుదేశం వేరు, ఎన్టీఆర్ హయాంలోనే తెలుగుదేశం వేరని ఆయన అన్నారు. తమ మంచి తనాన్ని బలహీనతగా తీసుకోవద్దని, సహనానికి కూడా హద్దుంటుందని ఆయన అన్నారు. తాము ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నామనే భయంతోనే తెలుగుదేశం పార్టీ తమపై శత్రుత్వం పెంచుకుంటోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+