చంద్రబాబుకు వైయన్ జగన్ ఫోబియా: కన్నా

Kanna Laxminarayana
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తమ కాంగ్రెసు పార్టీకి చెందిన వైయస్ జగన్ ఫోబియా పట్టుకుందని రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు నిరంతరం జగన్ జపం చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్ జోలికి రావద్దని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చంద్రబాబును హెచ్చరించారు. జగన్ రాజకీయాల్లోకి వస్తే తమకు పుట్టగతులుండవనే భయంతోనే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఓబుళాపురం అక్రమ తవ్వకాల్లో జగన్ ప్రమేయం ఉందని చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తప్పుడు పత్రాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఓబుళాపురం గనుల వ్యవహారంలో జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఓబుళాపురం గనుల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలుంటే చూపాలని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను డిమాండ్ చేశారు. తప్పుడు పత్రాలు చూపి గోల చేసే పద్ధతిని చంద్రబాబు మానుకోవాలని ఆయన సూచించారు. గతంలో ఓబుళాపురం గనులను పరిశీలించిన అఖిల పక్ష బృందం ఎటువంటి అక్రమాలు జరగలేదని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ బృందం తేల్చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు రాద్ధాంతం చేయడం తగదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+