పులివెందుల పోటీకి వైయస్ విజయలక్ష్మి విముఖత

విజయలక్ష్మి ఇష్టపడకపోతే వైయస్ కూతురు షర్మిళకు టికెట్ ఇవ్వడానికి పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే షర్మిళ కూడా పోటీకి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఎవరి పేరును ప్రతిపాదించాలనే విషయంపై తీవ్రంగానే చర్చ జరుగుతోంది. వైయస్ జగన్ భార్య భారతిరెడ్డి పేరు కూడా ముందుకు వచ్చింది. తాజాగా వైయస్ భాస్కర రెడ్డి పేరును ప్రతిపాదించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ భాస్కర రెడ్డి వైయస్ రాజశేఖరరెడ్డి సోదరుని కుమారుడు.












Click it and Unblock the Notifications