దిగి వచ్చినా జగన్ కు 'నో' చాన్స్

తనంత తాను జగన్ ప్రచారం చేస్తే తమకు అభ్యంతరం లేదనే పద్ధతిలో డి. శ్రీనివాస్, రోశయ్య వ్యవహరిస్తున్నారు. అసలు ఆ విషయం గురించి మాట్లడడానికి వారు ఇష్ట పడడం లేదు కూడా. జగన్ ను ప్రచారానికి పిలుస్తారని ఆశించిన ఆయన వర్గం అందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం నుంచి ఆయన ప్రచారం మొదలు పెట్టడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంది. తొలుత మధ్యాహ్నం రెండున్నర గంటలకు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడి ఆ తర్వాత ప్రచారంలోకి దిగాలనేది జగన్ వ్యూహం. అయితే ఎఐసిసి పరిశీలకుల నుంచి ఆహ్వానం రాకపోవడంతో జగన్ మీడియా ప్రతినిధుల సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలకు, ప్రభుత్వ కార్యకలపాలకు సంబంధించి ఏ విధమైన క్రెడిట్ కూడా జగన్ కు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. జగన్ ది కూడా మిగతా పార్లమెంటు సభ్యుల స్థాయేనని, అంతకు మించి ఆయనకు ఏ విధమైన ప్రత్యకత లేదని అటు పార్టీ అధిష్టానం ఇటు రాష్ట్ర నాయకత్వం తేల్చి చెప్పడానికి సిద్ధపడింది. దీంతో ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి గండి కొట్టింది.












Click it and Unblock the Notifications