ముంబై: ఫోర్బ్స్ పత్రిక తాజా లెక్కల ప్రకారం భారతదేశంలోని సంపన్నుల జాబితాలో తొలిస్థానం ముఖేష్ అంబానీకి దక్కింది. ఆయన తర్వాత స్థానాల్లో వరసగా లక్ష్మీమిట్టల్, అనిల్ అంబానీ, అజీం ప్రేమ్‌జీ, శశి అండ్ రవి రూయా, కె.పి. సింగ్ తదితరులున్నారు.
భారతదేశంలోని వందమంది సంపన్నుల సంపద 276 బిలియన్ డాలర్లని ఇది దేశ జిడిపిలో నాలుగో వంతని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. భారతీయ బిలియనీర్ల సంఖ్య కూడా గత ఏడాదికన్నా రెట్టింపైందని ఆ పత్రిక పేర్కొంది.