మాస్టారి 'హత్య' పై విద్యార్ధుల ఆగ్రహం

East Godavari
అమలాపురం: ఒక ఉపాధ్యాయుడి కోసం విద్యార్ధులు రోడ్ల మీదికి వచ్చిన సంఘటన ఇది. అల్లవరం రవితేజ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌, పేరూరు ఎస్‌బీఎం కాలేజీ అధ్యాపకుడు బళ్ళ రాజవర్ధన్‌ ది ముమ్మాటికీ హత్యేనంటూ విద్యార్థులు, మృతుని బంధువులు బుధవారం ఆందోళనకు దిగారు. అత్తింటివారే ఆయనను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థులు వృతదేహాన్ని కదలనీయకుండా ఆందోళన చేశారు. అల్లవరం మండలం డి.రావులపాలేనికి చెందిన రాజవర్ధన్‌ కామనగరువు పంచాయతీ పరిధిలోని ప్రతాప్‌ నగర్‌లోని అత్తవారింట్లో మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే.

ఆర్థిక లావాదేవీల వివాదంలో అత్తింటివారే హత్య చేశారని మృతుని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాజవర్ధన్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య విజయదుర్గాలకి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డి.రావులపాలెం నుంచి మృతుని బంధువులు, వందలాది మంది రవితేజ, పేరూరు ఎస్‌బీఎం కళాశాలల విద్యార్థులు ప్రతాప్‌ నగర్‌ చేరుకుని వృతదేహాన్ని పరిశీలించి ఆందోళన చేపట్టారు. రాజవర్ధన్‌ అత్త రాజ్యం, భార్య విజయదుర్గాలకి, మరిది పరమేశులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ అమలాపురం-చిందాడగరువు రోడ్డుపె బైఠాయించి రాస్తారోకో చేశారు.

మృతుని కుటుంబీకులు హత్యేనని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ ఎన్‌.వెంకటేశ్వరరావు హామీ ఇచ్చినప్పటికీ అంగీకరించలేదు. వృతదేహాన్ని కదలనివ్వమని భీష్మించారు. దీంతో పట్టణ ఎస్‌ఐ బిహెచ్‌.వెంకటేశ్వర్లు వృతుని అత్త రాజ్యం, భార్య విజయ దుర్గాలకిలను అదుపులోకి తీసుకోవడంతో ఆందోళన విరమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+