గుంటూరు: గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ సీహెచ్ శైలజాకిరణ్‌తో పాటు కుటుంబసభ్యులైన ఈనాడు ఎండీ కిరణ్, డాల్ఫిన్ హోటల్స్ లిమిటెడ్ ఎండీ విజయశ్రీలు కలిసి బంగారు కిరీటాన్ని బహుకరించారు. ఆలయం నిర్మించి ఈ ఏడాదికి దశమవార్షికోత్సవం పూర్తయిన సందర్భంగా స్వామి వారికి ఏదైనా బహుకరించాలని గతంలో మార్గదర్శి ఎండీని కోరగా ఆమె ఈ కిరీటాన్ని సమర్పించారని ఆలయ కమిటీ తెలిపింది. బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయం క్రమంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. ప్రతి శనివారం వేలాది మంది ఆలయాన్ని దర్శించుకుంటారు.