కెసిఆర్ ఆమరణ దీక్షను ఆపలేరు: నాయని

Nayani Narasimha Reddy
హైదరాబాద్: ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎంత నిర్బంధం విధించినా తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్షను అడ్డుకోలేరని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నాయని నర్సింహారెడ్డి అన్నారు. కెసిఆర్ దీక్షను అడ్డుకోవడానికి ప్రభుత్వాధికారులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. సిద్ధిపేటలో భూయజమానులకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులపై పెట్టిన బైండోవర్ కేసులను రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ దీక్షకు తెలంగాణ ఉద్యమకారుల మద్దతు ఉందని ఆయన అన్నారు. ఆంధ్ర పార్లమెంటు సభ్యులు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మార్పణ కూడా చేయనివ్వరా అని ఆయన అడిగారు.

కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం వల్ల తెలంగాణ రాదని కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇప్పటికే రావాల్సి ఉండిందని, అయితే అవగాహనా లోపం వల్ల జాప్యమైందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్ర్తత్యేక తెలంగాణపై మినహా ఫ్రీజోన్, ఆరు సూత్రాల పథకం, అసైన్డ్ భూముల ఆక్రమణ వంటి సమస్యలపై తాను మధ్యవర్త్తిత్వం చేయడానికి సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే, డిజిపి గిరీష్ కుమార్ మంగళవారం ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిశారు. కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని రోశయ్య గిరీష్ కుమార్ కు సూచించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+