జగన్ సాక్షిపై రామోజీ ఈనాడు బాంబు

Ramoji Rao
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్ కు నిధులు ప్రవహించిన తీరుపై రామోజీరావుకు చెందిన ఈనాడు దినపత్రిక తీవ్ర ఆరోపణలతో వార్తాకథనాన్ని ప్రచురించింది. పతాక శీర్షికన ప్రచురించిన ఈ కథనంలో సాక్షికి నిధులు వారంలోగా ఎలా సమకూరింది సవివరంగా రాశారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన వారంలోపల సాక్షికి 244 కోట్ల రూపాయలు సమకూరినట్లు ఈనాడు ఆరోపించింది. ప్రజలందరికీ చెందిన భూములు, ఖనిజ సంపద, నీరు వంటి ప్రకృతి సంపదను దోచి పెట్టినందుకు జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్ కు ఆ నిధులు ప్రసాదంగా సమకూరాయని వ్యాఖ్యానించింది.

ఈ ఏడాది మే 16వ తేదీ శాసనసభ ఫలితాలు వెలువడగా జగన్ స్థాపించిన సాక్షికి మే 21వ తేదీన వివిధ సంస్థల నుంచి 243 కోట్ల 60 లక్షల రూపాయలు వాటాల కొనుగోళ్ల రూపంలో సమకూరినట్లు తెలిపింది. అంతకు ముందు కొద్ది నెలల క్రితం నవంబరు 5వ తేదీన సాక్షికి ఇలా సమకూరిన నిధులు 39 కోట్ల 99 లక్షల రూపాయలు కాగా, రూ. 10 విలువైన ూరపరబ షేరును రజ. 350 ప్రీమీయంతో వివిధ సంస్థలు కొనుగోలు చేయడంతో మొత్తం 283కోట్ల 69 లక్షల రూపాయల వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు సమకూరినట్లు ఈనాడు దినపత్రిక వార్తాకథనం వివరించింది. సాక్షికి ఈ విధంగా నిధులు సమకూర్చినందుకు వివిధ సంస్థలు అత్యంత ఉదారంగా కేటాయింపులు పొందినట్లు ఆరోపించింది. చట్టబద్దంగా నిధులు మళ్లించేందుకు కొన్ని బినామీ కంపెనీలను కూడా ఏర్పాటు చేసినట్లు రాసింది. ఏయే కంపెనీ ఎంతెంత సమకూర్చిందీ అనే వివరాలను కూడా ఈనాడు దినపత్రిక తన వార్తాకథనంలో ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+