జగన్ ను విమర్శించేటంత కెకెకు ఉందా? గోనెల

K Kesava Rao
వరంగల్: కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ కే. కేశవరావు దిష్టి బొమ్మను కాంగ్రెస్‌ కార్యకర్తలు దగ్ధం చేశారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు కేకే ప్రవర్తను తప్పుపట్టారు. వైఎస్ జగన్ ఎవరో తనకు తెలియదని, ఆయన ఏం చేస్తుంటారో చెప్పలని కెకె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

కేశవరావు మీద ఇదే విషయంపై కాంగ్రెస్ నాయకుడు, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు మండిపడ్డారు. జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేకేపై ఆయన మండిపడ్డారు. సాక్షి టెలివిజన్‌తో మాట్లాడుతూ కేకే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.

ఇందిరా, రాజీవ్ ప్రచారం చేసినా డిపాజిట్‌ దక్కించుకోలేని కేకే స్థాయి ఏమిటో అందరికి తెలుసన్నారు. కేకే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారన్నారు. విదేశాల్లో కూడా అభిమానులున్న జగన్‌ స్థాయి అందరికీ తెలుసని గోనె అన్నారు. కేకే లాంటి సీనియర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటుందని గోనెల అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+