న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేతలో తాను మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిని తప్పు పట్టలేదని జస్టిస్ లిబర్హాన్ చెప్పారు. అయోధ్య ఉద్యమంలో కుహనా మధ్యేవాద నాయకుల్లో వాజ్ పేయి ఉన్నట్లు తాను చెప్పలేదని ఆయన మంగళవారం స్పష్టం చేశారు. ఎల్ కె అద్వానీ, ఎంఎం జోషీ వంటి కుహనా మధ్యేవాదులను ఖండించడంలో తాము వెనకాడలేదని ఆయన అన్నారు.
వాజ్ పేయిని విచారణ కోసం సమన్లు చేయకుండా తప్పు పట్టడమేమిటని అడిగితే తాను వాజ్ పేయిని తప్పు పట్టలేదని ఒక ఆంగ్ల దినపత్రికతో చెప్పారు. నివేదిక చదవి వాజ్ పేయిని తాను ప్రస్తావించానేమో చూపండని ఆయన అన్నారు.