విశాఖపట్నం: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా వున్నందున తెలంగాణ ప్రాంతంలోనూ చిరుజల్లులు పలకరించవచ్చని వాతావరణ అధికారులు తెలియజేసారు. ప్రతి ఏటా నవంబర్ లో వరి కోతల సమయంలో అల్పపీడనం ప్రబావంతో వర్షాలు కురిసి పంటనష్టానికి కారణమవుతున్న విషయం తెలిసిందే. ఇక తుపానులు సంభవిస్తే నష్టాన్ని అంచనా వేయడం కష్టం.