డిసెంబర్ తొలి వారంలో ఢిల్లీకి రోశయ్య

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. వివిధ అంశాలపై కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వంటి పలు అంశాలపై ఆయన చర్చలు జరిపుతారని అంటున్నారు. డిసెంబర్ 1వ తేదీ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్తారని అంటున్నారు. ఈలోగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు వెలువడి, మేయర్ అభ్యర్థిపై ఒక నిర్ణయం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమర నిరాహార దీక్ష, పులివెందుల శాసనసభా నియోజకవర్గం అభ్యర్థి ఖరారు వంటి అంశాలపై కూడా ఆయన పార్టీ అధిష్టానంతో చర్చిస్తారు. పులివెందుల అభ్యర్థి ఖరారైతే కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయడమా, లేదా అనేది తేలుతుంది. సిఎల్పీ సమావేశం డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించి, ఆ వెంటనే శాసనసభా సమావేశాలు ఏర్పాటుచేయాలనే యోచనలో రోశయ్య ఉన్నట్లు చెబుతున్నారు. ఇవి సజావుగా జరగడానికి పార్టీ అధిష్టానంతో ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+