కెసిఆర్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష శాంతియుతంగా సాగుతుందని, ఏ విధమైన హింసకు తావు ఉండదని కెసిఆర్ కుమారుడు, తెరాస శాసనసభ్యుడు కెటి రామారావుతో పాటు తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ కూడా చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో దీక్ష సాగించడానికి కూడా ప్రభుత్వం వీలు లేని వాతావరణాన్ని కల్పిస్తోందని రామారావు విమర్శించారు. బైండోవర్ నోటీసులు ఇవ్వడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం ప్రతిపాదించడానికి ముఖ్యమంత్రి కె. రోశయ్య ముందుకు రావాలని, ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ కాంగ్రెసు నాయకులు చర్చించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్దిష్ట చర్యలకు పూనుకునేలా చేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications