కెకె దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జగన్ అభిమానులు

K Kesava Rao
విస్సన్నపేట( కృష్ణా జిల్లా): కడప లోక్‌సభ సభ్యుడు, కాంగ్రెస్‌ యువనేత వైఎస్‌ జగన్మోహనరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు కే కేశవరావు దిష్టిబొమ్మను కాంగ్రెస్‌ కార్యకర్తలు గురువారం దగ్ధం చేశారు. మండలంలోని కృష్ణారావుపాలెంలో సత్తుపల్లి-విస్సన్నపేట రహదారిపై మండల యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కేకే దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చింతగుండ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేశవరావుకు మతిభ్రమించడం వల్లే జగన్‌ ఎవరో తెలియదన్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఎనిమిది కోట్ల ప్రజలకు తెలిసిన వైఎస్‌ జగన్‌ పేరు కేకేలాంటి వృద్ధనాయకుడికి తెలియకపోవడం పార్టీ చేసుకున్న దురదృష్టమని వ్యాఖ్యానించారు. కేకే స్థాయికి మించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. లేకుంటే రాష్ట్రంలో ఎక్కడా ఆయన తిరగనీయకుండా చేస్తామన్నారు. ఎస్సీసెల్‌ జిల్లా కార్యదర్శి వాసం కోటేశ్వరరావు, యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు చిట్టెం వేణుగోపాల్‌, గోలి విశ్వేశ్వరరావు, కుక్కల సుధాకర్‌, పీ శ్రీనివాసరెడ్డి, మల్లు మోహనరావు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+