ఒబామా విందు భళే పసందు: మన్మోహన్

మంగళవారంనాడు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ దంపతులకు ఒబామా విందు ఇచ్చారు. అక్కడికి వచ్చిన అతిథులు కూడా అంతే అద్భుతమని ఆయన అన్నారు. తాను ఎంతో ఆనందించానని ఆయన చెప్పారు. అక్కడికి అద్భుతమైన అతిథులు వచ్చారని, వారిని కలుసుకోవడం మంచి అనుభవమని ఆయన అన్నారు. భారత సంతతికి చెందిన అతిథులు తమ విశిష్టతను చాటారని ఆయన అన్నారు. వారు తమకు గౌరవాన్ని తెచ్చిపెట్టినట్లు ఆయన తెలిపారు. ఇది ఒబామా వ్యక్తిత్వానికి అద్దం పట్టిందని ఆయన చెప్పారు. తాను భారతీయుడినైనందుకు గర్వించేలా విందు ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications