కెసిఆర్ దీక్ష: అరెస్టులు, ఉద్రిక్తం

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. దీక్షకు అనుమతి లేదని పోలీసులు అధికారులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణలోని పట్టణాల్లో 144వ సెక్షన్ విధించారు. తెలంగాణ జిల్లాలోని తెరాస నేతల ఇళ్లపై పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాడులు చేశారు. శనివారం ఉదయానికి దాదాపు 50 మంది తెరాస నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కెసిఆర్ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. రహదారులను పోలీసులు దిగ్బంధం చేసే ప్రయత్నంలో ఉన్నారు. సిద్ధిపేటకు గానీ, కరీంనగర్ గానీ తెరాస కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు సమాయత్తమై ఉన్నారు.

చంద్రశేఖర రావు ఆమరణ దీక్షకు ఎటువంటి ముందస్తు అనుమతి లేదని సిద్ధిపేట ఎఎస్పీ విజయలక్ష్మి చెప్పారు. ఈ దీక్షకు సంబంధించిన సభ ఏర్పాట్లకు సహకరించేవారిపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా అరెస్టు చేస్తామని ఆమె అన్నారు. అయితే, దీక్షా శిబిరానికి చేరుకోవడానికి తెరాస నాయకులు పట్టుదలతో ఉన్నారు. కరీంనగర్ లోని కెసిఆర్ ఇంటి వద్ద కూడా వాతావరణం ఉద్రిక్తంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+