జగన్ వైపు మొయిలీ: అందుకే ప్రణబ్?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి చివరి నిమిషంలో వైయస్ జగన్ దిగడం వెనక కూడా మొయిలీ పాత్ర ఉందని అంటున్నారు. మొదటి నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి అనుకూలంగా ఉంటూ వస్తున్న మొయిలీ ఇప్పుడు జగన్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఒక వర్గం నుంచి వినిపిస్తోంది. జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడమే సోనియా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దానికి మొయిలీ జగన్ సానుకూల వైఖరి పనికి రాదనే అభిప్రాయానికి సోనియా వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే ప్రణబ్ కు పూర్తి అధికారాలు ఇచ్చి వీరప్ప మొయిలీని వెంట పంపినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications