థాకరేకు ఇంటి పోరు: కాంగ్రెసులోకి కోడలు

తాను ఎంత మాత్రమూ ఇబ్బంది పడదలుచుకోలేదని, కాంగ్రెసులో చేరడానికి నిర్ణయం తీసుకున్నానని స్మిత చెప్పారు. కాంగ్రెసుకు జాతీయ, ప్రాపంచిక దృక్పథం ఉందని ఆమె ప్రశంసిస్తున్నారు. కాంగ్రెసు సిద్ధాంతంతో తాను సౌకర్యంగా ఉందని ఆమె అన్నారు. సోనీయా పార్టీని, దేశాన్ని నడిపిస్తున్న తీరును తాను వ్యక్తిగతంగా అభిమానిస్తున్నట్లు ఆమె తెలిపారు. రాహుల్ ఎంతో పని చేస్తున్నారని ఆమె ప్రశంసించారు. తాను ఢిల్లీ నాయకులను సంప్రదిస్తున్నానని, కాంగ్రెసులో చేరడమే తరువాయి అని ఆమె అన్నారు. త్వరలో ఆమె సోనియాను, రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.శివసేన - బిజెపి కూటమి 1995లో అధికారంలోకి వచ్చినప్పుడు స్మిత అధికార కేంద్రంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications