డిసెంబర్ 1న విజయలక్ష్మి నామినేషన్

రాజశేఖర రెడ్డి మరణంతో పులివెందులకు ఉప ఎన్నిక అవసరమైంది. వచ్చే నెల 19వ తేదీన పువివెందుల ఎన్నిక జరుగుతోంది. పులివెందుల నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పోటీ చేయాలని ఆశించారు. అయితే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ సతీమణి విజయలక్ష్మి పేరును ఖరారు చేశారు. పులివెందుల నుంచి పోటీ చేసే విషయంలో తెలుగుదేశం పార్టీతో సహా ఇతర రాజకీయ పార్టీలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.












Click it and Unblock the Notifications