నామినేషన్ వేసిన వైయస్ విజయలక్ష్మి

నిజానికి, ఆమె పోటీకి సుముఖంగా లేరు. సోనియా గాంధీ నచ్చజెప్పడంతో ఆమె పోటీకి సిద్ధపడ్డారు. ఆమె మంగళవారం నాడు భర్తను తలుచుకుని కంట తడి పెడుతూనే ఉన్నారు. ఈ స్థితిలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడే స్థితి కూడా లేదు. ఇప్పటి వరకు పులివెందులకు ఆమె నామినేషన్ ఒక్కటే దాఖలైంది. మిగతా పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దించకూడదనే నిర్ణయం తీసుకోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. రేపు (బుధవారం) నామినేషన్ల స్వీకరణకు తుది గడువు. ఈ నెల 5వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవుతుంది. విజయలక్ష్మి ఎన్నికను అధికారులు ఎప్పుడు కచ్చితంగా ప్రకటిస్తారనే తెలియడం లేదు.