వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గాలి గనులపై ప్రధాని కదలాలి: చంద్రబాబు నాయుడు

ఓబుళాపురం మైన్స్ కంపెనీపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఇంకా అప్పగించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. సిబిఐ దర్యాప్తునకు కేంద్రానికి రాశామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారని, కానీ ఇంకా సిబిఐ దర్యాప్తు ప్రారంభం కాలేదని ఆయన అన్నారు. మైనింగ్ మాఫియా డబ్బుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. తమ ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం లీజులు రద్దు చేసిందని, ముడి ఇనుమును స్వాధీనం చేసుకుందని, అంతకు మించి చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. గురువారంనాడు ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాలాతో మాట్లాడారు. ఫరూఖ్ అబ్దుల్లాతో కూడా ఆయన సమావేశమయ్యారు. మైనింగ్ మాఫియాపై పోరుకు సహకరిస్తానని, చంద్రబాబు కృషి ప్రశంసనీయమని ఆయన చెప్పారు.