కాంగ్రెసు నేతల ఇళ్లు ముట్టడిస్తాం: ఈటెల

Etala Rajendar
హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారానికి కలిసి రాకపోతే కాంగ్రెసు నాయకుల ఇళ్లు ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఆయన గురువారం ఉదయం నిమ్స్ లో చికిత్స పొందుతున్న తమ నేత కె. చంద్రశేఖర రావును వరామర్శించారు. తెలంగాణ కాంగ్రెసు నాయకులు తెలంగాణ ప్రజల వైపు ఉంటారో లేదో తేల్చుకోవాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్ కోసం రాజీనామాలకు సిద్ధపడిన తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు తెలంగాణ ప్రజల కోసం ఎందుకు చేయరని ఆయన అడిగారు. కాంగ్రెసు నాయకులు భేషిజాలకు పోవద్దని ఆయన సూచించారు.

తమ రాష్ట్రం తమకు కావాలని ఆయన అన్నారు. తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉందని, తాను చూసుకుంటానని ముఖ్యమంత్రి కె. రోశయ్య అనడాన్ని ఆయన తప్పు పట్టారు. రోశయ్య మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు రాకపోతే పది జిల్లాలు అగ్నిజ్వాలలు కురిపిస్తాయని, కాంగ్రెసు మట్టి కరుస్తుందని ఆయన అన్నారు. అరెస్టు చేసిన తెలంగాణ నాయకులను, కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి నిస్సహాయ స్థితిలో ఉన్నారని, అందువల్ల మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డితో మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+