సోనియా పిలిస్తే ఢిల్లీ వస్తా: కె చంద్రశేఖర రావు

సోనియా గాంధీ వద్దకు తమతో పాటు వస్తానని కెసిఆర్ చెప్పినట్లు వారు తెలిపారు. కెసిఆర్ ఆరోగ్యం పట్ల తమ పట్టింపును తెలియజేసినట్లు వారు తెలిపారు. దీక్ష కొనసాగింపుపై ఆలోచించాలని తాము కెసిఆర్ కు సూచించామని వారు చెప్పారు. తెలంగాణ ఉద్యమం 1969లో కన్నా ఉధృతంగా ఉందని, ఈ విషయంలో తమకు వేరే అభిప్రాయం లేదని వారన్నారు. ఇప్పటికే తాము ఢిల్లీ నాయకులతో మాట్లాడామని వారు చెప్పారు. తెలంగాణ అంశంపై తాము చేయాల్సింది చేస్తున్నామని వారు చెప్పారు. తమతో సహకరించడానికి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారని వారు చెప్పారు.
కెసిఆర్ నిమ్స్ ఆస్పత్రిలో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ కూడా పరామర్శించారు. నిమ్స్ వద్ద తెరాస శ్రేణులు పెద్ద యెత్తున మోహరించాయి. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిమ్స్ నుంచి గ్రేహౌండ్స్ పోలీసులు వెళ్లిపోవాలని తెరాస కార్యకర్తలు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కెసిఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు.