ఆంధ్రా వర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీం చీఫ్ జస్టిస్

ఈ పర్యాయం న్యాయ విభాగం నుంచి ఎక్కువ మంది ప్రముఖులు వస్తున్నందున వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్‌కు డాక్టర్ ఆఫ్ లా ప్రదానం చేయనున్నామని, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కళాప్రపూర్ణ, జీఎంఆర్ అధినేత మల్లిఖార్జునరావు, పాండిచ్చేరి లెఫ్టనెంట్ గవర్నర్ ఇక్బాల్‌సింగ్‌కు గౌరవడాక్టరేట్స్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 238 మందికి పీహెచ్‌డీ, 62 మందికి ఎంఫిల్ డిగ్రీలు, పది మందికి బంగారు పతకాలు ప్రదానం చేస్తున్నట్టు వివరించారు. పీహెచ్‌డీ పట్టా తీసుకోనున్న 170 మంది పురుషులలో ఆర్ట్స్ విభాగం నుంచి 36 మంది, సైన్స్‌లో 50, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో 22, ఇంజనీరింగ్‌లో 30, కెమిల్ ఇంజనీరింగ్‌లో ఐదుగురు, ఎడ్యుకేషన్ లో ఏడు, 'లా'లో ఐదుగురు, ఫార్మసీలో 14 మంది ఉన్నారు.












Click it and Unblock the Notifications