అసెంబ్లీ గదిలో తెరాస ఎమ్మెల్యేల నిరాహార దీక్ష

TRS
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు ఇద్దరు శాసనసభ ఆవరణలోని తమ పార్టీ శాసనసభా పక్షం కార్యాలయంలో శుక్రవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గది తలుపులు వేసుకుని వారు నిరాహారదీక్షకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎంత చెప్పినా వారు తలుపులు తీయడం లేదు. గది కిటికీల నుంచే ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ విషయాన్ని తాము స్పీకర్ దృష్టికి తీసికెళ్తామని శాసనసభ సచివాలయం ప్రత్యేక కార్యదర్శి గోపాలకృష్ణ, చీఫ్ మార్షల్ ఆర్థర్ చెప్పారు. స్పీకర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని గోపాలకృష్ణ చెప్పారు.

తమ పార్టీ నేత కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా తాము ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినట్లు శాసనసభ్యుడు నల్లాల ఓదేలు చెప్పారు. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రతిపాదించాలని కూడా ఓదేలు, ఈశ్వర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయని, ఈ స్థితిలో ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాల్లో మొదటి రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తీర్మానం చేయాలనేది తమ కోరిక అని వారన్నారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పుడు కాంగ్రెసు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని వారన్నారు. శాసనసభ ప్రధాన గేట్లు కూడా మూసేశారు. శాసనసభ సభ్యులు కానివారు ఇక్కడ మాట్లాడకూడదని అసెంబ్లీ సిబ్బంది చెబుతున్నారు. ఈ స్థితిలో శాసనసభ వద్ద జై తెలంగాణ నినాదాలు జోరందుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+