బిజెపి తెలంగాణ ధర్నా: నేతల అరెస్టు

తెలంగాణ ప్రస్తావన రాకుండా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేస్తున్నాయని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. ప్రత్యేక తెలంగాణపై తెలుగుదేశం పార్టీ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన అడిగారు. తెలంగాణపై ముఖ్యమంత్రి కె. రోశయ్య సోమవారం పెట్టిన అఖిల పక్ష సమావేశాన్ని ఆభాసు పాలు చేశారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. యుపిఎ ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ తెలంగాణపై తమ వైఖరిని ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. అన్ని పార్టీలు తెలంగాణ తీర్మానానికి మద్దతు తెలుపుతామని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ముందుకు రాకపోవడాన్ని వారు తప్పు పట్టారు.