తూ.గో ప్రజారాజ్యం నుంచి వలసలే వలసలు

జిల్లా యువరాజ్యానికి రాజీనామా చేసిన కుడుపూడి అశోక్ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు. పీఆర్పీ జిల్లా కన్వీనర్ జ్యోతుల నెహ్రూ, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్, రాజమండ్రి మాజీ మేయర్ ఎం.ఎస్. చక్రవర్తి తదితర టీడీపీ వలస నేతలు తిరిగి 'సైకిల్' ఎక్కడమే ఉత్తమమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఏదో నిర్ణయం తీసుకోకపోవడానికి మూఢం ఒక కారణమైతే, స్థానిక ఎన్నికలకు ఇంకా సమయం ఉండడం మరో కారణంగా చెబుతున్నట్టు సమాచారం. ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు ఉండదనే విషయంపై మాత్రం నేతలు ఏకాభిప్రాయంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications