డిజిపి గిరీష్ కుమార్ ను కలిసిన గద్దర్

విశ్వవిద్యాలయంలోకి, విద్యార్థుల ఉద్యమంలోకి ఇతరేతర శక్తులు ప్రవేశించాయనే అనుమానం ఉంటే తెలంగాణ విద్యార్థుల సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులను పిలిపించి మాట్లాడాలని తాను కోరినట్లు ఆయన తెలిపారు. ఉద్యమంలో హింసకు పాల్పడుతున్నదెవరు గుర్తించాలని కూడా తాను విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు. దీక్షలు చేస్తున్న విద్యార్థులకు ఆటంకం కలిగించకూడదని ఆయన సోమవారం రాత్రి కూడా డిజిపిని కోరారు. విద్యార్థి సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కె. రోశయ్య చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.