కెసిఆర్ ను చంపేందుకు కాంగ్రెస్ కుట్ర: నాయని

Nayani Narasimha Reddy
హైదరాబాద్: తమ పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావును చంపేందుకు కాంగ్రెసు కుట్ర చేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నాయని నర్సింహారెడ్డి ఆరోపించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు మొండి వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. నిమ్స్ లో కెసిఆర్ ను పరామర్శించిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కెసిఆర్ కు ఏమైనా అయితే కాంగ్రెసు మట్టి కరుస్తుందని ఆయన హెచ్చరించారు. మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన కంట తడి పెట్టుకున్నారు. కంఠం గద్గదమైంది. తాము చెప్పినా కెసిఆర్ పట్టు వీడకుండా నిరాహార దీక్ష సాగిస్తున్నారని ఆయన చెప్పారు. దీక్ష విరమించాలని తమ పార్టీ పోలిట్ బ్యూరో కూడా విజ్ఞప్తి చేసిందని ఆయన చెప్పారు.

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాందీ కళ్లు తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు తెలంగాణపై తేల్చుకోవాలని ఆయన కోరారు. తెలంగాణపై కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదని, చిత్తశుద్ధి ఉంటే 10వ తేదీన విద్యార్థులు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అణచివేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని, శాసనసభలో తీర్మానం చేయాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+