తెలంగాణలో సాధారణ స్థితి: సంబరాలు

తాము తలపెట్టిన చలో అసెంబ్లీ శాంతి ర్యాలీని విద్యార్థులు విజయోత్సవ ర్యాలీగా మార్చారు. ఉద్యమంలోకి మావోయిస్టులు ప్రవేశించాయంటూ, అసాంఘిక శక్తులు చొరబడ్డాయంటూ తీవ్ర నిర్బంధ పరిస్థితులను కల్పించారు. ఐజి అనురాధ నేతృత్వంలో అణచివేతకు రంగం సిద్ధం చేశారు. అయితే చిదంబరం ప్రకటన వెలువడగానే బలగాలు వెనక్కి తగ్గాయి. హైదరాబాదులో విధించిన ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తేశారు. ఒక్కసారిగా హైదరాబాద్ భయం గుప్పిట్లోంచి బయటపడింది. తీవ్ర ఉత్కంఠ, భయాందోళనల మధ్య తెలంగాణ బుధవారం రాత్రి వరకు కొట్టుమిట్టాడుతూ వచ్చింది. గురువారం తెలంగాణ అంతటా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications