రాయలసీమ, కోస్తాంధ్రల్లో బంద్

తిరుపతి వెళ్లే బస్సులు ఆగిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కర్నూలు నుంచి అనంతపురం, కడప, విజయవాడ, చిత్తూరు, హైదరాబాద్, బెంగుళూర్, మహబూబ్ నగర్ లకు తిరిగే బస్సు సర్వీసు బస్సులు రద్దయ్యాయి. విజయవాడ నుంచి వెళ్లే రైళ్లు యథావిధిగా నడుస్తాయని అధికారులు ప్రకటించారు. అయితే పలు చోట్లు రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ఆందోళనకారులు రోడ్ల మీదికి వచ్చి ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గుంతకల్లులో బెంగుళుర్ - న్యూఢిల్లీ ఎక్స్ ప్రెస్ రైలు ఆగిపోయింది. భీమవరంలో తెరిచిన దుకాణాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. హిందూపురంలో భారీ ర్యాలీ జరిగింది. తెనాలిలో మార్కెట్ ను మూసేశారు.












Click it and Unblock the Notifications