వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ దీక్ష పై ఆంధ్రాలో అనుమానాలు...!!

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాదు: ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలంటూ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు పట్టు వదలని విక్రమార్కుడిలా పదకొండు రోజుల పాటు నిరాహారదీక్ష చేసి మొత్తానికి తను అనుకున్నది సాధించుకోగలిగారు. ఆ తర్వాత ఆంధ్ర, రాయలసీమ ఎమ్మెల్యేల రాజీనామాల పరంపర.. ఇవన్నీ చూస్తే తెలంగణా వస్తుందా..?? లేదా..?? అనే సందిగ్ధంలో ఉన్నారు రాష్ట్ర ప్రజలంతా.

దీనికి తోడు బంద్ కారణంగా కార్యాలయాలకూ, పాఠశాలలకూ సెలవు కావడంతో రాష్ట్రంలో ఏం జరుగతోంది అని ప్రతి ఒక్కరూ టివీ లకు అతుక్కుపోయారు. ఎమ్మెల్యేల రాజీనామా, దీనిపై పార్టీల స్పందనా, బంద్ వల్ల జరిగిన నష్టం లాంటి ప్రధాన వార్తల మధ్య ఓ వార్త అందరి దృష్టినీ ఆకర్షించింది. అదేంటంటే నిన్నటి వరకూ కెసిఆర్ పరిస్థితి చాలా విషమంగా వుంది, ఇలాగే వుంటే మేము కూడా ఏమీ చయ్యలేము, కోమాలోకి వెళ్లే అవాకాశాలు వున్నాయి అంటూ డాక్టర్లు చెప్పిన విషయం తెలిసిందే. అసలు కెసీఆర్ పరిస్థితి విషమంగా వుంది, అతనికి ఏమీ కాకూడదనే అంత వేగంగా ప్రత్యేక రాష్ట్ర తీర్మానం గురించి చిదంబరం ప్రకటించారనే వార్త కూడా వినిపిస్తోంది.

కానీ అంతటి విషమ పరిస్థితిలో వున్న కెసీఆర్ ప్రత్యేక తెలంగాణా తీర్మానానికి కేంద్రం అంగీకరించడంతో వెంటనే తేరుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనను ICU నుండీ స్పెషల్ వార్డ్ కు తరలించారు. అంతే కాదు ఉదయం నుండీ కెసీఆర్ ఘనాహారం ఏదీ తీసుకోలేదని, ద్రవపదార్థాలే తీసుకుంటున్నాడని డాక్టర్లు వెళ్లడించారు. కానీ ఈ రోజు ఆసుపత్రి నుండీ డిస్చార్జి అయిన కెసీఆర్ వీల్ చెయిర్ మీద వస్తూ తమ పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలుపడానికి లేచి నిలబడి మరీ అభివాదం చేసారు. అంతే కాదు ఒకానొక సమయంలో కొన్ని అడుగులు నడిచాడు కూడా...!! ఇందంతా చూసిన ప్రజానీకం మాత్రం నిన్నటి వరకూ చాలా విషమంగా వుంది, కోమాలోకి వెళ్లే అవకాశం వుంది అని చెప్పిన కెసీఆర్ కొన్ని గంటల్లోనే ఎలా తేరుకున్నాడబ్బా అని ఆశ్చర్యపోయారు...!! లోగుట్టు పెరుమాళ్లుకెరుక..!!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X