తెలంగాణ హామీపై వెనక్కి తగ్గం: పిఎం

కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన అపార్థానికి దారి తీసిందని, ఆ ప్రకటన సరిగా వెళ్లలేదని ఆయన చెప్పారు. అన్ని ప్రాంతాలవారి మనోభావాలను పరిగణనలోకి తీసుకునే నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమయ్యే విధంగా తమ నిర్ణయం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలవాల్సిందిగా ప్రధాని కోస్తాంధ్ర, రాయలసీమ ఎంపీలకు సూచించారు. కోస్తాంధ్ర, తెలంగాణ ఎంపీలు ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం మరోసారి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమవుతుంది.












Click it and Unblock the Notifications