హైదరాబాద్: సమైక్యాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ రాజీనామాలు చేసిన శాసనసభ్యుల సంఖ్య 103కు చేరుకుంది. రాజీనామా చేసిన శాసనసభ్యులెవరూ శాసనసభకు హాజరు కాలేదు. రాజీనామా చేసినవారిలో కాంగ్రెసు, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల శాసనసభ్యులు ఉన్నారు. శాసనసభ్యులు హాజరు కాకపోవడంతో శాసనసభ సజావుగా సాగడం కూడా కష్టంగానే ఉంది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో బంద్ జరుగుతోంది.
శాసనసభ శుక్రవారం సమావేశం కావడానికి ముందు వరకు 102 మంది రాజీనామా చేయగా, ఆ తర్వాత మరొకరు రాజీనామా చేశారు. శాసనసభ్యుల రాజీనామా చేసిన విషయాన్ని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. సభ కార్యక్రమాలు జరగలేదు.