సానుకూలంగా పరిష్కరించుకుందాం: రోశయ్య

రాష్ట్ర విభజనకు సంబంధించి అధికార పూర్వకంగా వెలువడే వరకు రణగొణ ధ్వనులు కూడవని ఆయన సూచించారు. అయితే పరిస్థితిని ఉద్రిక్త వాతావరణంలోకి తీసుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల వారు శాంతియుతంగా వ్యవహరించాలని, విధ్వంసానికి పాల్పడకూడదని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు చొరబడి కఠినంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, పోలీసులు సంయమనం పాటించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమని ఆయన అన్నారు. హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. సమస్య కేవలం అధికార పార్టీకి మాత్రమే సంబధించిందని అనుకోవద్దని, అన్ని రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications