పెరుగుతున్న రాజీనామాలు: అశోక్ రాజీనామా

కాంగ్రెసు శాసనసభ్యురాలు కుతూహలమ్మ కూడా తన పదవికి రాజీనామా చేశారు. తమ ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, ఈ స్థితిలో రాజీనామా చేయక తప్పడం లేదని శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యులు అన్నారు. ఇప్పటి వరకు రాజీనామాలు చేసిన వారి సంఖ్య 114కు చేరుకుంది. తెలుగుదేశం శాసనసభ్యుడు సాయిరాజ్ కూడా రాజీనామా చేశారు. శాసనసభ్యులు రాజీనామా చేయవద్దని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ ఫ్లోర్ లీడర్ గీతారెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ స్థితిలో అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ శాసనసభ్యులు శాసనసభ ఆవరణలో సమావేశమయ్యారు. కాగా, తెలంగాణేతర ప్రాంతాల శాసనసభ్యులు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమవుతున్నారు. శాసనసభ్యులతో మాట్లాడిన తర్వాతనే రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రకటించారు.












Click it and Unblock the Notifications