తెలంగాణ: కేంద్ర హోం సెక్రటరీపై చిదంబరం ఆగ్రహం

కేంద్ర హోం శాఖ సెక్రటరీ పిళ్లై తెలంగాణకు సంబంధించి చేసిన ప్రకటనపై హోం మంత్రి చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. పిళ్లై చేసిన ప్రకటన విషయం విలేకరులు చిదంబరం వద్ద ప్రస్తావించగా ఆయన అసహనం వ్యక్తం చేశారు. పిళ్లై ప్రకటనతో తనకు సంబంధం లేదని మంత్రి చెప్పారు. తెలంగాణ రాజధాని హైదరాబాదు అని పిళ్లై చెప్పిన విషయమై ప్రశ్నించగా, ఆ విషయం ఆయననే అడగండని మంత్రి సమాధానం చెపారు. ఆ తరువాత చిదంబరం ఫోన్ చేసి పిళ్లైపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జికె పిళ్లై ప్రకటించారు. తెలంగాణ రాజధాని హైదరాబాదే ఉంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటారని, ఆందోళనలు తగ్గుతాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించాలని సూచించారని, అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, వెంటనే రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications