విజయవాడలో సినిమా హాల్స్ సహా అన్నీ బంద్

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసే నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లా పరిషత్ చైర్మన్ కే నాగేశ్వరరావు, 49 మంది జెడ్పీటీసీ, ఇరువురు కో-ఆప్షన్ సభ్యులు గురువారం తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ విషయాన్ని పునరాలోచించకపోతే పార్టీలకతీతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పార్టీలకతీతంగా నేతలు బంద్‌లో పాల్గొంటున్నారు. గుంటూరు మిర్చియార్డులో వ్యాపారస్థులు కొనుగోళ్లు నిలిపివేశారు. మాచార్లలో రిలయన్స్ పెట్రోల్ బంకు అద్దాలను, ఆందోళనకారుల ధ్వంసం చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు జేఏసీగా ఏర్పడి సమైక్యాంధ్ర పిలుపునిచ్చారు. విద్యార్థులు జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కమ్మంపాడు వద్ద రాస్తారోకో నిర్వహిస్తున్న 30 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications