దేవినేని ఉమ ఆమరణ నిరాహార దీక్ష

Uma Maheshwara Rao
విజయవాడ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం శానససభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఉదయం పది గంటలకు ఆయన తన దీక్షను ప్రారంభిస్తారు. ఆయనతో పాటు నూజివీడ్ శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య, విజయవాడ మాజీ మేయర్ అనురాధ, వంశీ మోహన్, బొండా ఉమా మహేశ్వర రావు దీక్షకు కూర్చుంటారు. ఈ విషయాన్ని ఉమా మహేశ్వర రావు శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ఎట్టి పరిస్థితిలో కూడా రాష్ట్ర విభజన జరగడానికి వీలు లేదని ఆయన అన్నారు. తెలంగాణపై శాసనసభలో ప్రతిపాదించే విషయంలో కాంగ్రెసు ప్రభుత్వం తమ అబిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు. ప్రజల కోరిక మేరకే తాము రాజీనామాలు చేశామని, వారి అభీష్టం ప్రకారమే తాము నిరాహార దీక్షలకు దిగుతున్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+