వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సీమాంధ్ర కాంగ్రెసు నేతలు సరికారు: జానా

సంయమనంతో, సహనంతో తెలంగాణ కాంగ్రెసు నాయకులు దీక్షతో పని చేశారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ప్రశాంతంగా జరిగిందని, ఒకటి రెండు అవాంఛనీయ సంఘటనలు జరిగినా కాంగ్రెసు పెద్దలు జోక్యం చేసుకుని సంయమనంతో వ్యవహరించేలా చూశారని ఆయన చెప్పారు. కాంగ్రెసు పెద్దలు ప్రాంతాల మధ్య సామరస్యం దెబ్బ తినకుండా వ్యవహరించారని, ఇదే పద్ధతిని సీమాంధ్ర నేతలు పాటిస్తే మంచిదని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వాన్ని సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అంగీకరించడం మంచిదని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోవడం వల్ల తమకేదైనా నష్టం జరుగుతుందని భావిస్తే సీమాంధ్ర నేతలు ఆ విషయాలను అధిష్టానానికి చెప్పుకోవాలని, ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి సామరస్యపూర్వకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.