కూలర్‌ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా ?? ఇలా చేస్తే ఫ్రెష్ స్మెల్ పక్కా !

ఎండాకాలం మొదలైతే చాలా ఇళ్లలో ముందుగా గుర్తొచ్చేది ఎయిర్ కూలర్‌. ఏసీతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ చల్లదనం ఇచ్చే కూలర్‌లు మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఎంపికగా మారాయి. అయితే, కొన్నిసార్లు కూలర్ ఆన్ చేసిన వెంటనే గదినిండా ఒక వింతైన చేపల వాసన లేదా మురుగు వాసన రావడం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. చల్లని గాలి రావాల్సిన చోట అసహ్యకరమైన దుర్వాసన రావడంతో గదిలో ఉండటమే కష్టంగా మారుతుంది.

నిపుణుల ప్రకారం ఈ సమస్యకు ప్రధాన కారణం కూలర్ ట్యాంక్‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే నీరు. నీరు తరచూ మార్చకపోతే అందులో బ్యాక్టీరియా, ఫంగస్, ఆల్గీ వేగంగా పెరుగుతాయి. అవే గాలితో కలిసి బయటకు వచ్చి దుర్వాసనకు కారణమవుతాయి. ముఖ్యంగా వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ బ్యాక్టీరియా మరింత వేగంగా వ్యాపిస్తాయి.

cooler-smell-bad-if-you-do-this-you-will-get-definitely-smell-fresh-with-these-tips

ట్యాంక్ క్లీన్ చేయడం..

చాలా మంది కూలర్‌ను బయట నుంచి మాత్రమే శుభ్రం చేస్తారు. కానీ అసలు సమస్య ట్యాంక్ లోపలే ఉంటుంది. కాబట్టి కనీసం వారానికి ఒకసారి ట్యాంక్‌ను పూర్తిగా ఖాళీ చేసి, బ్రష్‌తో శుభ్రం చేయాలి. ట్యాంక్ మూలల్లో పేరుకుపోయిన మురికి, ఆల్గీని తొలగించాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన చాలా వరకు తగ్గుతుంది.

కూలర్ ప్యాడ్స్‌..

కూలర్‌లోని హనీకోంబ్ లేదా గడ్డి ప్యాడ్స్ ఎప్పుడూ తడిగా ఉండటం వల్ల వాటిలో ధూళి, బ్యాక్టీరియా చేరుతాయి. ప్యాడ్స్ నుంచి వచ్చే వాసనే చాలా సార్లు మొత్తం గదిలో వ్యాపిస్తుంది. అందుకే ప్రతి సీజన్ ప్రారంభంలో కొత్త ప్యాడ్స్ మార్చడం మంచిది. వెంటనే మార్చలేని పరిస్థితిలో వాటిని తీసి నీటితో బాగా కడిగి, ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఉంచడం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయి.

వైట్ వెనిగర్..

కూలర్ ట్యాంక్‌లో నీరు నింపిన తర్వాత ఒకటి లేదా రెండు స్పూన్ల వైట్ వెనిగర్ కలపడం మంచి ఫలితం ఇస్తుంది. వెనిగర్ సహజ డియోడరైజర్‌గా పనిచేసి దుర్వాసనను తగ్గిస్తుంది. అలాగే బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుంది. కెమికల్స్ వాడకుండా సహజంగా కూలర్‌ను ఫ్రెష్‌గా ఉంచడానికి ఇది మంచి మార్గం.

నిమ్మ తొక్కలు & వేప ఆకులు..

మంచి సువాసన కోసం కొంతమంది మార్కెట్లో దొరికే కూలర్ పర్ఫ్యూమ్‌లు ఉపయోగిస్తారు. కానీ సహజ పద్ధతులు ఇష్టపడేవారు నీటిలో నిమ్మ తొక్కలు లేదా వేప ఆకులు వేయొచ్చు. ఇవి సహజ క్రిమిసంహారకాలుగా పనిచేయడంతో పాటు గదిలో తేలికైన తాజా వాసనను పంచుతాయి.

డిటర్జెంట్లు..

కొంతమంది దుర్వాసన పోవాలనే ఉద్దేశంతో డిటర్జెంట్ పౌడర్‌లు లేదా బలమైన కెమికల్స్ నీటిలో కలుపుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల కూలర్ మోటార్ దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు, ఆ రసాయనాలు గాలి ద్వారా శ్వాసకోశ సమస్యలు కూడా కలిగించవచ్చు.

అంతే కాకుండా కూలర్‌ను పూర్తిగా మూసివేసిన గదిలో ఉపయోగిస్తే తేమ పెరిగి దుర్వాసన ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒక కిటికీ లేదా వెంటిలేషన్ తప్పనిసరిగా ఉండాలి. బయట గాలి లోపలికి వస్తే కూలర్ పనితీరు మెరుగవుతుంది, వాసన కూడా తగ్గుతుంది. అలానే వేసవి పూర్తయిన తర్వాత కూలర్‌ను అలాగే నిల్వ చేయకుండా, ట్యాంక్ పూర్తిగా ఆరిపోయేలా చూడాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కూలర్ నుంచి వచ్చే అసహ్యకరమైన వాసనను పూర్తిగా నివారించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+