పసిడి ధరలకు గత వైభవం- ఈ వారంలో..
నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదు. సోమవారం నుంచి వీటి రేట్లల్లో భారీగా కదలికలు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అంతర్జాతీయ అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, బలమైన సురక్షిత పెట్టుబడి డిమాండ్ దీనికి ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తోన్నారు. గత ట్రేడింగ్ సెషన్‌తో పోల్చితే స్వల్ప దిద్దుబాటు ఉన్నా దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి రికార్డు గరిష్ట స్థాయిలకు దగ్గరగా ట్రేడవుతోంది.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,52,670కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,39,940 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర 2,75,100 రూపాయలకు చేరుకుంది. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 100 రూపాయల మేర పెరుగుదల కనిపించిందిందులో. ఈ పెరుగుదల మరింత జోరందుకోవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,52,870 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,40,090 రూపాయలకు చేరింది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,14,650గా పలుకుతోంది. ఇక్కడ వెండి గ్రాముకు 275 రూపాయలుగా కోట్ అయింది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో బంగారం ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,52,670, 22 క్యారెట్లు రూ. 1,39,940గా ధర పలికాయి.
చెన్నైలో బులియన్ ధరలు కొద్దిగా అధికంగా నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,53,850, 22 క్యారెట్లు రూ. 1,41,030గా ధర పలికింది. వెండి ధరల విషయంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలలో కిలో వెండి రూ. 2,75,100గా ఉండగా, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర తక్కువ పలికింది. ఇక్కడ రూ. 2,74,800గా నమోదైంది.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,437, 22 క్యారెట్లు - రూ. 14,150, 18 క్యారెట్లు - రూ. 11,810
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426

Click it and Unblock the Notifications