సీఎం సార్.. లుక్ అదిరింది! ఫార్మల్ లుక్‌లో విజయ్ ఎంట్రీ

తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం ఆరంభమైంది. ఆరు దశాబ్దాల ద్రవిడ పార్టీల గుత్తాధిపత్యాన్ని చెరిపివేస్తూ, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు సి. జోసెఫ్ విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ చారిత్రాత్మక ఘట్టానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే సినీ పరిశ్రమ నుంచి విజయ్ సన్నిహిత మిత్రురాలు, నటి త్రిష కూడా ఈ వేడుకలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే వంటి మిత్రపక్షాల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

సినిమాల్లో మాస్ లుక్‌లో కనిపించే విజయ్, తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాత్రం చాలా హుందాగా హాజరయ్యారు. తెల్లటి షర్టును ఇన్‌షర్ట్ చేసి, ఫార్మల్ డ్రెస్‌లో స్టేడియానికి చేరుకున్న విజయ్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. తన నివాసం నుంచి స్టేడియం వరకు భారీ కాన్వాయ్‌తో ఆయన తరలిరాగా, దారిపొడవునా అభిమానులు నీరాజనాలు పలికారు.

TVK Chief Vijay Sworn In As Tamil Nadu CM Formal Look Steals The Show As Actor-Politician Takes Oath 2026

60 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర

1967 నుంచి తమిళనాడును పాలిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల ఆధిపత్యానికి విజయ్ చెక్ పెట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో TVK ఏకంగా 108 సీట్లు గెలుచుకోగా, మిత్రపక్షాల మద్దతుతో కూటమి బలం 118 దాటింది. తద్వారా ఎంజీఆర్, జయలలిత తర్వాత రాజకీయాల్లో విజయవంతమైన మరో సూపర్ స్టార్‌గా విజయ్ అవతరించారు. మే 13లోగా అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆయనను ఆదేశించారు.

విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష.. వీడియో వైరల్ !!
విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష.. వీడియో వైరల్ !!

పెరియార్ బాటలో.. లౌకిక వాదంతో..

తన రాజకీయ ప్రయాణంలో సామాజిక సంస్కర్త పెరియార్‌ను ఆదర్శంగా తీసుకున్న విజయ్.. అంబేడ్కర్, కామరాజ్, అన్నాదురై ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తానని స్పష్టం చేశారు. అణ్వాయుధాలు లేని, డ్రగ్స్ లేని తమిళనాడును నిర్మిస్తానని ఆయన తన ప్రసంగాల్లో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల నుంచి విజయం సాధించిన విజయ్, త్వరలో ఒక స్థానానికి రాజీనామా చేయనున్నారు.

TVK ఎమ్మెల్యేగా ఆటో డ్రైవర్.. కట్ చేస్తే కోటీశ్వరుడా?
TVK ఎమ్మెల్యేగా ఆటో డ్రైవర్.. కట్ చేస్తే కోటీశ్వరుడా?

విజయ్ ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కడంతో తమిళనాడు అంతటా పండుగ వాతావరణం నెలకొంది. లౌకిక వాదాన్ని, సామాజిక న్యాయాన్ని తన అజెండాగా ప్రకటించిన విజయ్.. పాలనలో ఎలాంటి మార్పులు తెస్తారోనని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+