జోసెఫ్ విజయ్ అనే నేను... ఉద్విగ్నం - రాహుల్ సమక్షంలో, అభిమానుల పండుగ..!!

జెసెఫ్ విజయ్ అనే నేను.. అంటూ దళపతి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసిన విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఏర్పాటు వేళ అంతే ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు పూర్తి మెజార్టీ సాధించిన విజయ్ ను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. భారీగా తరలి వచ్చిన అభిమానుల సమక్షం లో.. రాహుల్ గాంధీ సాక్షిగా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసారు. చెన్నై లోని నెహ్రూ స్టేడియంలో సరిగ్గా 10.17 గంటలకు విజయ్ సీఎంగా ప్రమాణం చేసారు. విజయ్ తో పాటుగా తొమ్మిది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేదిక మీద విజయ్ పక్కనే ఆశీనులయ్యారు. విజయ్ కు అభినందనలు తెలిపారు. విజయ్ కుటుంబ సభ్యులు.. త్రిష ఈ వేడులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. చెన్నై మొత్తం విజయ్ పేరుతో మార్యోగింది. గవర్నర్ ఆర్టేకర్ విజయ్ తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు.

సీఎంగా విజయ్ తొలి సంతకం - ఫ్యాన్స్, మహిళలు ఫిదా..!!
సీఎంగా విజయ్ తొలి సంతకం - ఫ్యాన్స్, మహిళలు ఫిదా..!!
vijay-take-oath-as-chief-minister-of-tamil-nadu-with-9-ministers-rahul-gandhi-at-venue

విజయ్ ఎమోషనల్.. అభిమానుల పండుగ

https://twitter.com/ANI/status/2053333273615737270

విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం గా మహిళలకు హామీ ఇచ్చిన ఉచిత బస్సు పథకం పైన సంతకం చేసారు. ఇప్పటి వరకు చెన్నై నగరానికే పరిమితం అయిన ఉచిత బస్సు ఈ పథకం ద్వారా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. మాజీ ముఖ్యమంత్రులకు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్లు టవీకే నేతలు వెల్లడించారు. పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+