తెలంగాణ ఏర్పాటుకు డెడ్ లైన్ లేదు: కెసిఆర్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణేతర శాసనసభ్యుల మాదిరిగా తెలంగాణ శాసనసభ్యులు కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని ఆయన అన్నారు. చండీఘర్ మాదిరిగా రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉండే అవకాశం లేదని ఆయన అన్నారు. హైదరాబాదులో 90 శాతం మంది తెలంగాణవాసులే ఉన్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టినవారే సమైక్యాంధ్ర ఉద్యమం వెనక ఉన్నారని, ఆ ఉద్యమానికి పునాది లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications